మ‌హేష్ దుబాయ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారారా?

మ‌హేష్ దుబాయ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారారా?
మ‌హేష్ దుబాయ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారారా?

మ‌హేష్‌బాబు థ‌మ్స్ అప్‌తో పాటు చాలా క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వియం తెలిసిందే. కొత్త‌గా దుబాయ్ అందాల‌ని పొగిడేస్తూ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో అయిన అభిమానులే కాదు సాధార‌ణ సినీ ప్రియులు కూడా ఏంటీ మ‌హేష్ దుబాయ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయారా అని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే..మ‌హేష్ న‌‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ దుబాయ్‌లో జ‌రుగుతోంది.

షార్జా స‌మీపంలోని చారిత్ర‌క‌ మెలీహా ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. ఎడారిలో కీల‌క పోరాట ఘ‌ట్టాల్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా దుబాయ్ లొకేష‌న్‌ల గురించి మ‌హేష్ వ‌రుస‌గా ట్వీట్‌లు చేస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. `ఇక్క‌డి ప్రాంతం చెప్పే క‌థ‌లు, వినోద కార్య‌క‌లాపాలు, అంద‌మైన ప్ర‌కృతి దృశ్యాలు నాకు ఎప్ప‌టికీ గుర్తుంటాయి` అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు. అలాగే ఆన్ లొకేష‌న్‌కి సంబంధించిన ఫొటోల‌ని పంచుకున్నారు.