రియ‌ల్ హీరోస్ మ‌ధ్య స్టార్ హీరో!


Mahesh sheres meeting with soldiers pics
Mahesh sheres meeting with soldiers pics

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు, అనిల్ సుంక‌ర‌తో క‌లిసి మ‌హేష్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇందులో తొలిసారి మ‌హేష్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. మ‌హేష్ సినిమాల్లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది.

బోర్డ‌ర్‌లో ప్రాణాల‌కు తెగించి ప‌హారా కాసే రియ‌ల్‌హీరోల‌కు ఈ చిత్రాన్నిఅంకితం చేస్తున్నామ‌ని చిత్ర బృందం ఇటీవ‌ల జ‌రిగిన ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌ల‌తో పేర్కొంది. త్వ‌ర‌లోనే క‌శ్మీర్ బోర్డ‌ర్ త‌మ సినిమా షూటింగ్‌కి స‌హ‌క‌రించిన జ‌వాన్‌ల‌తో క‌లిసి ఓ ప్ర‌త్యేక కార్యక్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు వెల్ల‌డించారు. దాని ప్ర‌కార‌మే ఈ  నెల 26న 71వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జ‌వాన్‌ల‌ని క‌ల‌వాల‌నుకున్నార‌ట‌. కానీ ఈ స‌మ‌యంలో మ‌హేష్ అమెరికాలో వుండ‌టం వ‌ల్ల క‌ల‌వ‌లేక‌పోతున్నాన‌ని వెల్ల‌డించారు.

క‌శ్మీర్ జ‌రిగిన షూటింగ్ సంద‌ర్భంగా ఆ స‌మ‌యంలో సోల్జ‌ర్స్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ని మ‌హేష్ త‌న ఇన్‌స్టా గ్రామ్ ద్వారా అభిమానుల‌కు షేర్ చేయ‌డం ఆస‌ల‌క్తిక‌రంగా మారింది. ధైర్య వంతులైన సైనికుల‌ని ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌డం ఆనందంగా గ‌ర్వంగా వుంద‌ని, ఇది త‌న జీవితంలో మ‌ర్చిపోలేని రోజ‌ని, ప్ర‌తీ రోజు జాతికి కాప‌లా కాస్తున్న రియ‌ల్ హీరోస్‌కి సెల్యూట్ అని పేర్కొన్నారు.