సీసీసీకి విరాళం ప్ర‌క‌టించిన మ‌హేష్ సోద‌రి


సీసీసీకి విరాళం ప్ర‌క‌టించిన మ‌హేష్ సోద‌రి
సీసీసీకి విరాళం ప్ర‌క‌టించిన మ‌హేష్ సోద‌రి

క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్త లాక్ డౌన్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్రా వ్యాప్తంగా లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించారు. రోజు వారి ఆదాయం న‌ష్ట‌పోతున్నా స‌రే ప్ర‌జ‌లు బాగుండాల‌ని ప‌న్నుల ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని కూడా లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేసింది. చేస్తోంది. లాక్ డౌన్ కార‌ణంగా అన్ని బంద్ కావ‌డంతో కార్మికులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

వారి కోసం చిరు అధ్య‌క్ష‌త‌న సీసీసీ పేరుతొ ఓ చారిటీని ప్రారంభించారు. దీనికి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్రముఖులు విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్ప‌టికీ ప్ర‌క‌టిస్తూనే వున్నారు. తాజాగా హీరో మ‌హేష్ సోద‌రి, అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత ప‌ద్మావ‌తి గ‌ల్లా సీసీసీ చారిటీకి 10 ల‌క్ష‌లు విరాళాన్ని బుధావారం ప్ర‌క‌టించారు. గ‌ల్లా ప‌ద్మావ‌తి, గ‌ల్లా జ‌య‌దేవ్‌ల త‌న‌యుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో సినీ కార్మికులు ఇడ్డందుల్ని ఎదుర్కొంటున్నారు. సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు సినీ పెద్ద‌లంతా ముందుకు రావ‌డం శుభ‌ప‌రిణామనీ, ఆ మంచి పనిలో  భాగం కావాల‌నే ఉద్దేశ్యంతో సీసీసీకి మా వంతుగా 10 ల‌క్ష‌లు అంవ‌జేస్తున్నామ‌ని గ‌ల్లా ప‌ద్మావ‌తి వెల్ల‌డించారు.