మ‌హేష్ – ప‌ర‌శురామ్‌ సినిమా టైటిల్ ఇదే?

మ‌హేష్ - ప‌ర‌శురామ్‌ సినిమా టైటిల్ ఇదే?
మ‌హేష్ – ప‌ర‌శురామ్‌ సినిమా టైటిల్ ఇదే?

2018 లో `భ‌ర‌త్ అనే నేను`, 2019లో `మ‌హ‌ర్షి`.. 2020లో `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి వ‌రుస‌గా మూడు బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని సొంతం చేసుకున్నారు మ‌హేష్‌. హ్యాట్రిక్ హిట్‌ని సొంతం చేసుకున్న ఆయ‌న తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌హేష్ త‌న 27వ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌తో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. `శ్రీ‌మంతుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌మ‌స్త్రష్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌లో తెర‌పైకి రానున్న చిత్ర‌మిది. చాలా కాలంగా మ‌హేష్‌ని డైరెక్ట్ చేయాల‌ని ఓ వండ‌ర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసుకున్న ప‌ర‌శురామ్ ఈ చిత్రాన్ని ఓ మెమోర‌బుల్ ఫిల్మ్‌గా తీర్చి దిద్దాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన ఈ నెల 31న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇందుకు స‌ర్వం సిద్ధం చేశారు. ఇదిలా వుంటే ఈ చిత్రం కోసం ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ని ఫిక్స్ చేశార‌ట‌. ఈ చిత్రానికి `స‌ర్కారు వారి పాట‌` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ఖ‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు తెలిసింది. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్టు వినిపిస్తోంది. `భ‌ర‌త్ అనే నేను` ఫేమ్ పీఎస్ వినోద్ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్నార‌ట‌. జిఎమ్‌బి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. అసోసియేట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.