మళ్ళీ మహేష్ – తమన్ కాంబినేషన్.?Mahesh & Thaman Combo for MB 27
Mahesh & Thaman Combo for MB 27

2020 సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో “సరిలేరు నీకెవ్వరు”, “అల వైకుంఠపురం” సినిమాలు మరియు ఒక చిన్న సినిమా అయిన ఎంత మంచి వాడవురా ఉన్నాయి. అయితే “అల వైకుంఠపురం” సినిమా మొదటి నుంచి మ్యూజిక్ పరంగా ఎంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల్లోనూ మ్యూజిక్ పరంగా హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అల వైకుంఠపురం లో.

దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ని తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ రెండు సినిమాలు గనుక పక్కన పెట్టి చూస్తే, కచ్చితంగా సరిలేరు నీకెవ్వరు సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా చాలా బాగున్నప్పటికీ, ఎక్కువగా జనాలకు రిజిస్టర్ కాలేదు. ఇక మైండ్ బ్లాక్ సాంగ్, తమన్నా సాంగ్ ఇవన్నీ గతంలో ఉన్న పాత ట్యూన్ లను కొంచెం మార్చి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసాడని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చేశారు. అలా అని తమన్ ను కూడా ఎవరు వదిలిపెట్టలేదు.

కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు తాను తర్వాత చేయబోయే సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్లీ తమన్నా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమన్ మహేష్ బాబు కాంబినేషన్ లో దూకుడు, బిజినెస్ మాన్, ఆగడు సినిమాలు వచ్చాయి. దూకుడు సినిమాలో పాటలు చాలా హిట్ అయ్యాయి.

కాబట్టి మహేష్ తన తర్వాత చేయబోయే చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటే చాలా కలిసొస్తుందని, ఇప్పటికే మహేష్ బాబు పి.ఆర్ &క్రియేటివిటీ ఆయనకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారని సమాచారం. ఇప్పటికే ఈ సంక్రాంతికి హిట్ తో ఖాతా తెరిచిన మహేష్ ఏడాది చివరికల్లా మరొక చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పూరి జగన్నాథ్ గారు చెప్పినట్లు “ఎవరైనా హిట్ ఉంటేనే ఇండస్ట్రీలో పట్టించుకుంటారు” అన్నమాట ఇలాంటి విషయాల్లో ఎంతో కొంత నిజం అవుతుంది.