ఫన్నీ రూమర్: ఛత్రపతి శివాజీ స్టోరీలో మహేష్


ఫన్నీ రూమర్: ఛత్రపతి శివాజీ స్టోరీలో మహేష్
ఫన్నీ రూమర్: ఛత్రపతి శివాజీ స్టోరీలో మహేష్

ఒక్కోసారి రూమర్స్ వింటుంటేనే ఎంత సిల్లీగా ఉన్నాయో కదా అని అనిపిస్తుంది. అసలు సెట్ అవ్వదు అని తెలిసినా కూడా రూమర్ రాయుళ్లు వాటిని పుట్టిస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించిన అలాంటి రూమర్ సర్క్యూలేట్ అయింది. వివరాల్లోకి వెళితే

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రాన్ని చేయనున్నాడు మహేష్. జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రం పూర్తయ్యాక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్నాడు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి, స్టోరీ లైన్ ఎలా ఉండబోతోంది వంటి వివరాలు ఏమి తెలీదు.

అయితే మహేష్ హీరోగా రాజమౌళి ఛత్రపతి శివాజీ జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తాడని ప్రచారం మొదలైంది. నార్త్ వాళ్లకు శివాజీతో కనెక్షన్ ఎక్కువ. అలాగే సౌత్ లో కూడా ఈ పేరు పరిచయమే. అందుకే ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేయడానికి ఇలాంటి హిస్టారికల్ సబ్జెక్ట్ అయితే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వినడానికే ఎబ్బెట్టుగా ఉన్న ఈ రూమర్ నిజమవుతుందా లేదా అన్నది చూడాలి.