ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Bigg Boss Telugu 3
Bigg Boss Telugu 3

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు రాహుల్, పునర్నవి, మహేష్, వరుణ్ సందేశ్. వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అన్న సంగతి తెల్సిందే. ఇక శనివారం రావడంతో ఇంట్లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న చర్చ మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం ఈ వారం మహేష్ విట్టా ఎలిమినేట్ కాబోతున్నాడని సమాచారం. ఇప్పటికే హౌజ్ లో నుండి ఎలిమినేట్ కావడానికి చాలా సార్లు నామినేట్ అయిన మహేష్, సేవ్ అవుతూ వచ్చాడు. అయితే ఈసారి మాత్రం మహేష్ ఆటలు సాగవని అర్ధమవుతోంది.

ఎందుకంటే వరుణ్ సందేష్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అతను ఫైనల్స్ కు వెళ్లడం దాదాపు ఖాయం. రాహుల్, పునర్నవి జంటగా ఉంటే జనాలు చూస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళని అప్పుడే విడదీయకపోవచ్చు. ఈ నేపథ్యంలో మహేష్ విట్టా ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా ఉంది.