మరోసారి స్పై అవతారం ఎత్తనున్న మహేష్మరోసారి స్పై అవతారం ఎత్తనున్న మహేష్
మరోసారి స్పై అవతారం ఎత్తనున్న మహేష్

స్పై అంటేనే మహేష్ ఫ్యాన్స్ కంగారు పడే పరిస్థితి ఉంది. అదంతా మురుగదాస్ అందించిన స్పైడర్ సినిమా ఎఫెక్టే. అయితే పేరుకే ఆ చిత్రంలో మహేష్ స్పై కానీ కథంతా వేరేగా ఉంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ మరోసారి స్పై గా చేయబోతున్నాడట. అయితే ఈసారి పూర్తిగా స్టైలిష్ గా, జేమ్స్ బాండ్ తరహాలో మహేష్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా తన తర్వాతి సినిమా కోసమే.

మహేష్ బాబు ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇదే ఉత్సాహంతో మహేష్ తన తర్వాతి చిత్రాన్ని కూడా ఓకే చేసేసాడు. మహర్షితో తనకు సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు యూఎస్ ట్రిప్ లో ఉన్నాడు. అది పూర్తయ్యాక వంశీ పైడిపల్లి చెప్పే ఫుల్ నరేషన్ వింటాడు.

వంశీ పైడిపల్లి ఈలోగా మిగతా ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నాడు. థమన్ ను ఇప్పటికే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మహేష్ – థమన్ ఇప్పటివరకూ నాలుగు సార్లు కలిసి పనిచేసారు. దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు చిత్రాలు మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ ఆల్బమ్స్ గా నిలిచాయి. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న థమన్, ఈసారి మహేష్ కోసం ఎలాంటి ఆల్బమ్ ఇస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇంకా వంశీ పైడిపల్లి హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాడు.

ఏప్రిల్ లో షూటింగ్ ను మొదలుపెట్టి డిసెంబర్ కల్లా పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనే ప్రణాళికల్లో ఉన్నారు మహేష్ – వంశీ పైడిపల్లి.