ఎఫ్3 లో మహేష్? జరిగే పనేనా?Mahesh to play extended cameo in f3?
Mahesh to play extended cameo in f3?

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక అలవాటుంది. తనకి ఎవరైనా దర్శకుడు నచ్చితే వెంటనే వాళ్లతో మరో సినిమాకు కమిట్ అయిపోతూ ఉంటాడు. గతంలో ఇలా చాలా సార్లు జరిగినా రీసెంట్ గా చూసుకుంటే కొరటాల శివతో శ్రీమంతుడు, భరత్ అనే నేను చేసాడు. వంశీ పైడిపల్లితో మహర్షి చేసి తన వర్కింగ్ స్టైల్ నచ్చి వెంటనే మరో సినిమా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మరో రెండు నెలల్లో లాంచ్ కానుంది. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేష్. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి స్పీడ్ కు, ఎంటర్టైన్మెంట్ మీద ఉన్న కమాండ్ కు ఫిదా అయిపోయాడు. వెంటనే మరో సినిమా చేస్తానని మాట ఇచ్చేసాడు. అయితే దానికింకా సమయం పడుతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లు ప్రస్తుతం మహేష్ కు వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ఉంది. అనిల్ రావిపూడికి కూడా ఎఫ్ 3 సినిమా కమిట్మెంట్ ఉంది.

ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఎఫ్ 3 ఉంటుందని అప్పుడే ప్రకటించాడు రావిపూడి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో మహేష్, అనిల్ రావిపూడి కాంబో మళ్ళీ రిపీట్ కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది అనుకున్నారంతా. అయితే అనిల్ రావిపూడి ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఎఫ్ 3 లో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరోకి కూడా అవకాశం ఉంది. దీనికి ముందు రవితేజను అనుకున్నా తర్వాత దాన్నుండి వెనక్కి తగ్గారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ రోల్ కోసం రావిపూడి, మహేష్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ సెకండ్ హాఫ్ లో వచ్చి మొత్తం ఎంటర్టైన్మెంట్ ను టేకోవర్ చేస్తుందని అంటున్నారు.

అయితే ఇప్పటిదాకా మహేష్ ఇలా గెస్ట్ రోల్స్ వేసింది లేదు. మరి అనిల్ రావిపూడి కోసం ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో నటిస్తాడా, ఇది అసలు నమ్మదగిన రూమరేనా??.