రామ్ చరణ్ హీరోగా మహేష్ సినిమా?


రామ్ చరణ్ హీరోగా మహేష్ సినిమా?
రామ్ చరణ్ హీరోగా మహేష్ సినిమా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కు కమిటై ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూట్ కరోనా వల్ల ఆలస్యమవడంతో ఎప్పటి నుండి షూటింగులు తిరిగి మొదలవుతాయో, ఎప్పటికి ఈ చిత్రం పూర్తవుతుందో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా ఏ సినిమాకూ కమిటవ్వలేదు. అయితే తన తండ్రి చిరంజీవి హీరోగా చేస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్ స్పెషల్ రోల్ పోషిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న విషయం తెల్సిందే.

మరోవైపు గత కొన్ని రోజులుగా వంశీ పైడిపల్లి చెప్పిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ వార్తకు సంబంధించి రీసెంట్ గా వచ్చిన ఒక అప్డేట్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అదే ఈ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మించనుండడం.

వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని మహేష్ బాబు మాట ఇచ్చాడు, అయితే అది తాను హీరోగా కుదరకపోవడంతో రామ్ చరణ్ కు ఈ కథను సిఫార్సు చేయడం, తానే నిర్మిస్తానని ముందుకు రావడం జరిగాయట. మరి ఈ విషయంలో ఎంతవరకూ నిజముందో వారికే తెలియాలి.