మ‌హేష్ రాముడు.. మ‌రి సీత ఎవ‌రు?

Mahesh to romence deepika padukone in  ramayana 3D
Mahesh to romence deepika padukone in  ramayana 3D

పాన్ ఇండ‌యా చిత్రాల ప‌రంప‌ర ప్ర‌స్తుతం జోరందుకుంది. ఏ స్టార్ హీరోని క‌దిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా మూవీ. ప్ర‌స్తుతం సెట్స్‌పై అర‌డ‌జ‌నుకు పైగానే పాన్ ఇండియా స్థాయి చిత్రాల నిర్మాణం జ‌రుగుతోంది. ఇందులో రామా‌య‌ణ గాథ నేప‌థ్యంలో రూపొందుతున్న 3డీ ఫా‌ర్మాట్ మూవీ `ఆది పురుష్‌` కూడా వుంది. తాజాగా ఇదే త‌ర‌హా క‌థాంశంతో రామాయ‌ణ గాథ నేప‌థ్యంలో మ‌రో భారీ 3డీ మూవీ సెట్స్ పైకి రాబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త కొన్ని నెల‌ల క్రితం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ మ‌ధు మంతెన రామాయ‌ణ గాథ‌ని త్రీడీలో తెర‌పైకి తీసుకురావాల‌నుకున్నారు. ముందు ఈ క‌థ‌ని హృతిక్ రోష‌న్‌తో చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఎందుకో హృతిక్ ఇందులో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌లేదు. దాంతో ఈ మూవీని మ‌హేష్‌తో చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు. రాముడిగా మ‌హేష్ ని  న‌టింప‌జేయాల‌నుకున్నారు. స్క్రిప్ట్‌ని మ‌హేష్‌కు వినిపించారు. స్క్రిప్ట్ న‌చ్చింది కానీ మ‌హేష్ ఈ మూవీకి ఇప్ప‌టికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నితీష్ తివారి డైరెక్ష‌న్‌లో చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే ఆ త‌రువాత ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ మ‌ళ్లీ బ‌య‌టికి రాలేదు. అల‌క‌లు అర‌వింద్ వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాల‌నుకున్న ఈ మూవీకి సంబంధించిన తాజాగా మ‌రో వార్త‌ల చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌హేష్ రాముడిగా న‌టించ‌నున్న ఈ మైథ‌లాజిక‌ల్‌ మూవీలో సీత‌గా దీపికా ప‌దుకోన్ న‌టించే అవ‌కాశం వుంద‌ని తాజాగా వినిపిస్తోంది. నిర్మాత మ‌ధు మంతెల‌న ఇటీవ‌ల ఆమెని క‌లిశార‌ని, దీపిక కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని బాలీవుడ్‌లో ఓ వార్త‌ షికారు చేస్తోంది.