మహేష్ సినిమా షూటింగ్ మొదలయ్యింది


mahesh vamsi paidipalli movie regular shoot startభరత్ అనే నేను చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అయిపోయాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ – దిల్ రాజు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది దాంతో కోర మీసాన్ని పెంచాడు మహేష్ అంతేకాదు గడ్డం ని కూడా పెంచాడు . గడ్డం , మీసం తో మహేష్ గెటప్ చాలా బాగుంది .

ఈరోజు డెహ్రాడూన్ లో ఈ సినిమా ప్రారంభం కానుంది . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది . కాగా ఈ చిత్రాన్ని 2019 లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . ఈ సినిమా అసలు ఎప్పుడో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాలి కానీ రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ ఇప్పటికి డెహ్రాడూన్ వెళ్ళాడు మహేష్ బాబు . భరత్ అనే నేను తర్వాత మహేష్ నుండి వస్తున్న చిత్రం కావడంతో మహేష్ అభిమానులు ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంటున్నారు .