మహేష్ కొత్త సినిమా రిలీజ్ ఎపుడో తెలుసా


mahesh vamsi paidipalli movie releasing in summer 2019

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . డెహ్రాడూన్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది . అగ్ర నిర్మాతలు అశ్వనీదత్దిల్ రాజు లతో పాటు పివిపి కూడా నిర్మిస్తున్న ఈ చిత్రం ని 2019 లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ అనుకున్నారు అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం కావడంతో సంక్రాంతి కి విడుదల చేయడం కష్టమని అందుకే వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నారట .

వేసవి కానుకగా ఏప్రిల్ లో మహేష్ సినిమాని విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట ఆ చిత్ర బృందం . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రం పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇటీవల విడుదలైన భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రానికి క్రేజ్ ఏర్పడింది . డెహ్రాడూన్ , అమెరికా , హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం సంక్రాంతి కి కాకుండా ఏప్రిల్ లో విడుదలైతే మహేష్ అభిమానులకు కూడా సంతోషమే ! ఎందుకంటే వేసవిలో విడుదలైన మహేష్ చిత్రాలు ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయి .

English Title: mahesh vamsi paidipalli movie releasing in summer 2019