షిర్డీలో స్టార్ హీరో మ‌హేష్ హంగామా!


Mahesh visits shiridi sai baba temple
Mahesh visits shiridi sai baba temple

సినిమా రిలీజ్ స‌మ‌యంలో అందులో న‌టించిన క్రేజీ స్టార్స్ దేవాల‌యాల్ని ద‌ర్శించ‌డం టాలీవుడ్‌లో ఆన‌వాయితీగా వ‌స్తోంది. చాలా వ‌రకు తిరుప‌తి వెళ్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకుని వ‌స్తుంటారు. కానీ ఈ ద‌ఫా మ‌హేష్ మాత్రం షిర్డీకి వెల్ల‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ‌న‌వ‌రి 11న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా ద్వారా చాలా విరామం త‌రువాత లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌యశాంతి మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ అందించిన పాట‌లు ఇప్ప‌టికే చార్ట్ బ‌స్ట‌ర్స్‌లో టాప్‌లో నిలిచాయి. కాగా ఈ సినిమా రిలీజ్ ని పురస్క‌రించుకుని హీరో మ‌హేష్ షిర్డీని సంద‌ర్శించ‌డం ఆస‌క్తిక‌ర‌కంగా మారింది. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో అక్క‌డి పోలీసులు మ‌హేష్‌కు భారీ బందోబ‌స్తుని ఏర్పాటు చేశారు.

మ‌హేష్ షిర్డీ టూర్‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌హేష్ తొలిసారి ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలున్నాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన త‌మ‌న్నా పార్టీ సాంగ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించ‌డం ఖాయం అని చెబుతున్నారు. జ‌న‌వ‌రి 5న ఎల్బీ స్టేడియంలో భారీ ప్రీరిలీజ్ వేడుక‌ని జ‌ర‌ప‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌రు కాబోతున్న విష‌యం తెలిసిందే.