బిగ్ బాస్ : మహేష్ విట్టా ఎలిమినేషన్ కన్ఫర్మ్


బిగ్ బాస్ : మహేష్ విట్టా ఎలిమినేషన్ కన్ఫర్మ్
బిగ్ బాస్ : మహేష్ విట్టా ఎలిమినేషన్ కన్ఫర్మ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి హౌజ్ లో ఎనిమిది మంది ఉండగా రేపు ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే నామినేట్ అయిన ముగ్గురూ టఫ్ కావడంతో హౌజ్ లో నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు వరుణ్, రాహుల్, మహేష్ ముగ్గురికీ ఓటింగ్ పోటాపోటీగా జరగడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది.

అయితే లీకైన సమాచారం బట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మహేష్ విట్టా ఈ వారం హౌజ్ లోంచి బయటకు రానున్నాడు. మరికాసేపట్లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. ఈరోజు ఎలిమినేట్ అయినా కానీ ఒకరోజంతా మహేష్ ను బయటకు పంపరు. మొత్తానికి 12 వారాలు హౌజ్ లో సర్వైవ్ అయిన మహేష్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నాడు. అలీ, రవి, హిమజ, పునర్నవి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పాటు నామినేట్ అయినా కానీ మహేష్ సేవ్ అవుతూ వచ్చాడు.

అయితే వరుణ్, రాహుల్ ల పాపులారిటీ ముందు మహేష్ నిలవలేక ఎలిమినేట్ అయ్యాడు. ఈ వీక్ ఎపిసోడ్ తర్వాత ఉండేది రెండు వారాలే కాబట్టి నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండనుంది. అయితే ఇప్పటికే శ్రీముఖి, వరుణ్, రాహుల్, బాబా మాస్టర్ లు ఫైనల్స్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. శివజ్యోత, వితిక, అలీల మధ్య ఫైనల్ బెర్త్ కోసం పోటీ నెలకొంది. వారిలో కూడా శివజ్యోతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.