మళ్ళీ రకుల్ కావాలంటున్న మహేష్


mahesh wants rakul preet singhమహేష్ బాబు సరసన స్పైడర్ చిత్రంలో నటించింది హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ . అయితే ఆ సినిమా దారుణంగా దెబ్బకొట్టింది మహేష్ ని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా . అయినప్పటికీ రకుల్ తో మళ్ళీ రొమాన్స్ చేయాలనీ ఆశపడుతున్నాడు మహేష్ . తాజాగా మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా ఆ సినిమా కంప్లీట్ అయ్యాక రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ .

కాగా సుకుమార్ – మహేష్ బాబు ల కాంబినేషన్ లో రూపొందబోయే ఆ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట మహేష్ . ఈ విషయం సుకుమార్ కు చెప్పడం సుక్కు కూడా ఓకే అనడం జరిగిందని అంటున్నారు . ఇక మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ” 1” నేనొక్కడినే చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది కానీ నటుడిగా మహేష్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది . అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో ఇప్పుడు చేయబోయే సినిమా తప్పకుండా బాగుండాలని , హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడట సుకుమార్ . మహేష్ ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడానికి సమాయత్తం అవుతున్నాడు సుకుమార్ . అయితే ముందుగానే హీరోయిన్ గా రకుల్ ని తీసుకోవాలని అనుకున్నారట .

English Title: mahesh wants rakul preet singh