సమంత కు థాంక్స్ చెప్పిన మహేష్ భార్య


సమంత కు థాంక్స్ చెప్పింది మహేష్ భార్య నమ్రత . మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మహేష్ బాబు కు బెస్ట్ విషెష్ చెబుతూ మహర్షి మంచి హిట్ కావాలని ఓ వీడియో ని సమంత పోస్ట్ చేసిన విషయం తెలిసిందే . కాగా సమంత ట్వీట్ కు రీ ట్వీట్ చేసి మాకు నువ్వంటే చాలా ఇష్టం అందునా మా కూతురు సితార కు మరీ మరీ ఇష్టం అంటూ థాంక్స్ చెప్పింది నమ్రత .

మహేష్ కూతురు సితార తో కలిసి సమంత పలుమార్లు ఫోటోలకు ఫోజిచ్చిన విషయం తెలిసిందే . పైగా సితార కు పూర్తిగా మాటలు రాని సమయంలో సితార మాట్లాడే వచ్చి రాని మాటలకు సమంత తెగ మురిసిపోయేదట ! అలాగే సమంత నటించిన సినిమాలోని పాటలు వింటూ సితార డ్యాన్స్ లు కూడా చేసేది . దాంతో సితార కు సమంత అంటే ఇష్టం , అదే విషయాన్నీ చెబుతూ రీ ట్వీట్ చేసింది నమ్రత .