భరత్ అనే నేను 50 రోజుల వసూళ్లు


maheshbabu Bharat Ane Nenu 50 days collections

మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన భరత్ అనే నేను చిత్రం మొత్తానికి యాభై రోజులను పూర్తిచేసుకుంది . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో మళ్ళీ మహేష్ తో పాటు మహేష్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు . వరుస పరాజయాలతో సతమతం అయిన మహేష్ కు భరత్ అనే నేను చిత్రం రూపంలో సూపర్ హిట్ లభించింది . మొత్తం యాభై రోజులలో 149 కోట్ల కు పైగా గ్రాస్ ని 92 కోట్ల షేర్ ని వసూల్ చేసింది . అయితే మరిన్ని వసూళ్ల ని సాధిస్తేనే కొంతమంది బయ్యర్లు లాభాలలోకి వెళ్తారు .

ఏరియాల వారీగా భరత్ అనే నేను సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం – 18. 90 కోట్ల షేర్
సీడెడ్ – 9. 90 కోట్ల షేర్
కృష్ణా – 5. 86 కోట్లు
గుంటూరు – 8. 33 కోట్లు
ఈస్ట్ – 6. 86 కోట్లు
వెస్ట్ – 4. 41 కోట్లు
నెల్లూరు – 2. 64 కోట్లు
ఉత్తరాంధ్ర – 8. 70 కోట్లు
ఓవర్ సీస్ – 12. 4 కోట్లు
కర్ణాటక – 8. 20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 5. 8 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ – 92 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – 149. 5 కోట్లు