మ‌హేష్ ఏజ్ పెరుగుతోందా.. త‌గ్గుతోందా?

Maheshs Fitnes trainer reveals secrets of mahesh fitnes
Maheshs Fitnes trainer reveals secrets of mahesh fitnes

లాక్‌డౌన్‌కి ముందు లాక్‌డౌన్ త‌రువాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఏజ్ గురించి పెద్ద స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది.  లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటిప‌ట్టునే వుంటూ ప్ర‌తీ రోజు జిమ్‌లో కాల‌క్షేపం చేసిన మ‌హేష్ త‌న త‌న‌యుడు గౌత‌మ్‌లా మారిపోయారు. ఇద్ద‌రూ క‌లిసి వున్న ఫొటోల‌ని చూసిన చాలా మంది ఇందులో మ‌హేష్ ఎవ‌రు.. గౌత‌మ్ ఎవ‌రు అంటే గుర్తుప‌ట్ట‌లేక‌పోయారు. అంత యంగ్ మ‌హేష్ మారిపోయారు.

మామూలుగానే మిల్క్ బాయ్‌లా క‌నిపించే మ‌హేష్ లాక్‌డౌన్ వ‌ల్ల మ‌రింత వ‌య‌సుని త‌గ్గించుకుని టీనేజీ కుర్రాడిలా మారిపోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇప్ప‌టికే అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న మ‌హేష్ దుబాయ్ షూటింగ్ షెడ్యూల్‌లోనూ టైమ్ దొరికితే ఫిట్‌నెస్‌కి కేటాయించేస్తున్నారు. మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం దుబాయ్‌లో జ‌రుగుతోంది. షూటింగ్ విరామంలో ఫిట్‌నెస్ ట్రైన‌ర్ మినాష్ గాబ్రియేల్ .. మ‌హేష్‌తో వ‌ర్క‌వుట్ లు చేయిస్తూ అబ్బుర ప‌రుస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. `స‌ర్కారు వారి పాట` షూట్ కోసం మేము దుబాయ్ వ‌చ్చి 30 రోజులైంది. ఇక్క‌డికి వ‌చ్చాక ఒక్క రోజు కూడా జిమ్‌ని మిస్ చేయ‌లేదు. వ‌రుస‌గా వ‌ర్క‌వుట్‌లు చేస్తూనే వున్నాం. 2019 నుంచి ఆయ‌న‌కు ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. సెట్‌లో ఎంత శ్ర‌మించినా సాయంత్రం వ‌ర్క‌వుట్‌ల విషయంలో ఏమాత్రం రాజీప‌డ‌రు. అంద‌రి వ‌య‌సు పెరుగుతున్నా మ‌హేష్ ఏజ్ త‌గ్గుతోంది` అని తెలిపారు.