`మైదాన్` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది!`మైదాన్` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది!
`మైదాన్` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది!

1952- 1962.. భార‌తీయ ఫుల్ బాల్ గేమ్ స్వ‌ర్ణ‌యుగం. ఈ కాలం నాటి క‌థ‌తో రూపొందుతున్న చిత్రం `మైదాన్‌`. అజ‌య్ దేవ్‌గ‌న్ ఫుల్ బాల్ కోచ్‌గా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్రియ‌మ‌ణి అత‌నికి భార్య‌గా క‌నిపించ‌బోతోంది. ఇంద‌కు ముందు ఈ పాత్ర కోసం కీర్తిసురేష్‌ని తీసుకున్నారు. రెండు రోజులు షూటింగ్ కూడా జ‌రిగింది. అయితే త‌నకు స్క్రిప్ట్ స‌రిగా వినిపించ‌లేద‌ని, పాత్ర‌కు ఎక్క‌డా ప్రాధాన్య‌త‌లేద‌ని కీర్తి సురేష్ ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది.

దాంతో ఆమె స్థానంలో ప్రియ‌మ‌ణిని చిత్ర బృందం ఫైన‌ల్ చేసింది. య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సయ్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ లైఫ్ స్టోరీ స్ఫూర్తితో ఈ క‌థ‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. జీ స్టూడియోస్‌తో క‌లిసి బోనీక‌పూర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని హీరో అజ‌య్ దేవ్‌గ‌న్ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా రిలీజ్ చేశారు.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో షూస్‌, టీమ్ అంతా బుర‌ద‌మ‌య‌మై క‌నిపిస్తున్నారు. ఓ కోర్ట్‌లో కాకుండా బుర‌ద‌మ‌య‌మైన‌ మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్న‌ట్టుగా క‌నిపిస్తున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫోటోకి అజ‌య్ దేవ్‌గ‌న్ `గెట్ రెడీ ఫ‌ర్ మైదాన్ 27 న‌వంబ‌ర్ 2020` అనే ఓ క్యాప్ష‌న్‌ని కూడా జ‌తచేశారు. అమిత్ ర‌వీంద్ర‌నాథ్ శ‌ర్మ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 27న రిలీజ్ కాబోతోంది.