68 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన మజిలీ


68 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన మజిలీ
మజిలీ పోస్టర్

అక్కినేని నాగచైతన్యసమంత జంటగా నటించిన మజిలీ చిత్రం 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 68 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని వసూల్ చేసి సంచలనం సృష్టిస్తోంది . ఏప్రిల్ 5 న విడుదలైన ఈ  మజిలీచిత్రం ఇప్పటికి కూడా చాలా చోట్ల మంచి వసూళ్ళ ని సాధిస్తోంది . దాంతో 68 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 68 కోట్ల గ్రాస్ వసూళ్లు 38 కోట్ల 52 లక్షల షేర్ వసూల్ చేసింది .

థియేటర్ ల రూపంలోనే 38 కోట్లకు పైగా షేర్ రాగా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ , రీమేక్ రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలోనే వచ్చి పడుతున్నాయి మజిలీ చిత్రానికి . చాలాకాలం తర్వాత నాగచైతన్య కు సాలిడ్ హిట్ దక్కడంతో చైతూ చాలా సంతోషంగా ఉన్నాడు . మజిలీ ఇచ్చిన జోష్ తో మేనమామ వెంకటేష్ తో ” వెంకీ మామ ” అనే చిత్రంలో నటిస్తున్నాడు .