ఏప్రిల్ లో 2 హిట్స్


ఏప్రిల్ నెల టాలీవుడ్ కి ఎంతో ప్రీతికరమైనదనే చెప్పాలి ఎందుకంటే చిత్ర పరిశ్రమ స్లంప్ లో ఉన్న ప్రతీసారి ఏప్రిల్ లో మంచి హిట్స్ ఇస్తోంది . ఇంతకుముందు లాగే ఈ ఏడాది లో కూడా ఏప్రిల్ నెల చిత్ర పరిశ్రమకు కలిసి వచ్చింది . ఈ ఏడాది లో ఇప్పటివరకు నాలుగు నెలలు పూర్తి కావస్తున్నాయి అయితే సాలిడ్ హిట్ ఒక్కటే లభించింది అది ” ఎఫ్ 2 ” రూపంలో మాత్రమే !

జనవరి లో రిలీజ్ అయిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఆ సినిమా తర్వాత చెప్పుకోతగ్గ హిట్ ఒక్కటి కూడా లేదే అని నిర్మాతలు , బయ్యర్లు బాధపడుతుంటే నేనున్నాను అంటూ ఏప్రిల్ 5 న మజిలీ వచ్చింది . కేవలం నాలుగు రోజుల్లోనే నిర్మాతలకు , బయ్యర్లకు పెట్టిన పెట్టుబడి ని తిరిగి ఇచ్చేసింది . ఇక ఐదో రోజునుండి లాభాలే ఆ సినిమాకు . కట్ చేస్తే నిన్న నాని నటించిన జెర్సీ చిత్రం విడుదల అయ్యింది . ఈ సినిమాకు కూడా యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది . దాంతో ఏప్రిల్ లో 2 సినిమాలు టోటల్ గా ఈ నాలుగు నెలల్లో 3 హిట్స్ లభించాయి టాలీవుడ్ కు .