మజిలీ రివ్యూ


మజిలీ రివ్యూ
నటీనటులు : నాగచైతన్య , సమంత , దివ్యంకా కౌశిక్ , పోసాని
సంగీతం : గోపిసుందర్
నేపథ్య సంగీతం : తమన్
నిర్మాతలు : సాహు గారపాటి , హరీష్ పెద్ది
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2019

 

పెళ్ళికి ముందు మూడు సినిమాల్లో కలిసి నటించారు అక్కినేని నాగచైతన్యసమంత లు . అయితే పెళ్లయ్యాక మాత్రం కలిసి నటించిన చిత్రం ఈ మజిలీ . టీజర్ , ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెరిగేలా చేసిన మజిలీ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

 

పూర్ణ ( అక్కినేని నాగచైతన్య ) టీనేజ్ కుర్రాడు . మంచి క్రికెట్ ప్లేయర్ కూడా దాంతో అన్షు ( దివ్యంకా కౌశిక్ ) పూర్ణ ని ఇష్టపడుతుంది . క్రమంగా ఇద్దరూ ప్రేమించుకుంటారు కానీ పెద్దల వల్ల టీనేజ్ లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది దాంతో ప్రేయసి ని మర్చిపోలేక డిప్రెషన్ కి గురౌతాడు పూర్ణ . అలా డిప్రెషన్ లో ఉండగానే శ్రావణి ( సమంత ) తో పెళ్లి చేస్తారు . ప్రేయసి ని మర్చిపోలేక పెళ్ళాం తో సరిగ్గా కాపురం చేయలేక పూర్ణ ఎలాంటి మానసిక క్షోభ అనుభవించాడు . చివరకు పూర్ణ – శ్రావణి ఒక్కటయ్యారా ? కథ సుఖాంతం అయ్యిందా ? లేదా ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

నాగచైతన్య
సమంత
దివ్యంకా కౌశిక్ గ్లామర్
పాటలు
నేపథ్య సంగీతం
ఇంటర్వెల్ బ్యాంగ్
సెంటిమెంట్

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్

 

నటీనటుల ప్రతిభ :

కొత్త అమ్మాయి దివ్యంకా కౌశిక్ గ్లామర్ తో అలరించింది అలాగే నటనతో కూడా ఆకట్టుకుంది . సమంత ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది . సమంత నటన గురించి కొత్తగా చెప్పేదేముంది అయితే మధ్య తరగతి గృహిణి గా నిజంగానే అద్భుతంగా నటించింది . ఇక నాగచైతన్య నటన విషయానికి వస్తే నటుడిగా మజిలీ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది . టీనేజ్ కుర్రాడిగా , తీవ్ర మానసిక క్షోభ అనుభవించే యువకుడిగా రెండు విభిన్న కోణాలను ప్రదర్శించి నటుడిగా మరో మెట్టు ఎదిగాడు చైతూ . ఇద్దరు హీరోయిన్ లతో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా జాగ్రత్త పడ్డాడు చైతూ . ఇక మిగిలిన పాత్రల్లో పోసాని , రావు రమేష్ లు ఈ చిత్రానికి పిల్లర్స్ గా నిలబడ్డారు .

 

సాంకేతిక వర్గం :

మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఆరు పాటలను అందించాడు , ఆరు పాటలు కూడా సినిమాకు చాలా హెల్పయ్యాయి , అయితే నేపథ్య సంగీతం మాత్రం తమన్ అందించాడు . తమన్ రీ రికార్డింగ్ లో స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే . తమన్ రీ రికార్డింగ్ మజిలీ కి హైలెట్ గా నిలిచింది . విష్ణు శర్మ విజువల్స్ తో ఆకట్టుకున్నాడు . షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి . నిన్ను కోరి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన శివ నిర్వాణ మరోసారి హృదయానికి హత్తుకునే అంశంతో మజిలీ ని రూపొందించి విజయం సాధించాడు . ఎమోషనల్ లవ్ డ్రామా గా మజిలీ ని రూపొందించి వేసవి లో హిట్ గా నిలిచాడు .

 

ఓవరాల్ గా :

తప్పకుండా మజిలీ ని ఎంజాయ్ చేయొచ్చు .