భారీ ధరకు అమ్ముడుపోయిన మేజర్ ఓవర్సీస్ హక్కులు

భారీ ధరకు అమ్ముడుపోయిన మేజర్ ఓవర్సీస్ హక్కులు
భారీ ధరకు అమ్ముడుపోయిన మేజర్ ఓవర్సీస్ హక్కులు

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒరిజినల్ గా ఈ చిత్రాన్ని జులై 2న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మేజర్ విడుదల ఇప్పుడు వాయిదా పడింది. 26/11 ముంబై అటాక్స్ లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ ను తెరకెక్కించారు.

తెలుగు, హిందీతో పాటు ఈ సినిమా మలయాళంలో కూడా విడుదల కానుంది. శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మేజర్ ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

వీకెండ్ సినిమా, సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ తో కలిసి ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. శాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల మేజర్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.