వచ్చే నెల నుండి మేజర్ షూటింగ్

వచ్చే నెల నుండి మేజర్ షూటింగ్
వచ్చే నెల నుండి మేజర్ షూటింగ్

టాలెంటెడ్ నటుడు అడివి శేష్ నటిస్తోన్న సినిమా మేజర్. ఈ చిత్రాన్ని జులై 2న విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా కారణంగా ఏప్రిల్ నుండి సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో మేజర్ విడుదల వాయిదా పడింది. 26/11 ఎటాక్స్ లో ప్రాణాలు అర్పించిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసారు. ఇక తాజా సమాచారం ప్రకారం మేజర్ షూటింగ్ వచ్చే నెల నుండి మొదలుకానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి విడుదల తేదీపై ఒక నిర్ణయం తీసుకుంటారు.

మహేష్ బాబుతో కలిసి సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శోభిత ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. మేజర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.