ప‌వ‌ర్‌స్టార్ కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?ప‌వ‌ర్‌స్టార్ కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?
ప‌వ‌ర్‌స్టార్ కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?

`అజ్ఞాతవాసి` చిత్రం త‌రువాత ప‌వ‌న్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చి దాదాపు రెండేళ్ల‌వుతోంది. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ క్రియాశీల రాజకీయాల్లో బిజీ అయిపోయిన ఆయ‌న మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్న‌ విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా తెలుగు లో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. సినిమాకు దాదాపు భారీ స్థాయిలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పారితోషికం అందుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు ఆయ‌న‌ కేవ‌లం 30 రోజులు మాత్ర‌మే కేటాయించార‌ట‌. ఈ 30 డేస్ షెడ్యూల్‌ని జాగ్ర‌త్త‌గా వాడుకోవాల‌ని ప్లాన్ చేసిన నిర్మాత‌లు ప‌వ‌న్ లొకేష‌న్‌కు రావ‌డం, వెల్ల‌డం కోసం ఓ మీనీ విమానాన్ని అద్దెకు తీసుకోబోతున్నార‌ట‌.

ఇందు కోసం ఏకంగా కోటి ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజా నిర్ణ‌యానికి ఓకే చెప్పిన‌ట్టు చెబుతున్నారు. అన్నీ అనుకున్న స‌మ‌యానికి పూర్త‌యితే చిత్రాన్ని స‌మ్మ‌ర్‌కు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.