`అల వైకుంఠ‌పుర‌ములో` `అర్జున్‌రెడ్డి` సీన్!

`అల వైకుంఠ‌పుర‌ములో` `అర్జున్‌రెడ్డి` సీన్!
`అల వైకుంఠ‌పుర‌ములో` `అర్జున్‌రెడ్డి` సీన్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిని అండ్ హాసిక క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ఎస్‌. రాధాకృష్ణ‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించిన విష‌యం తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది.

బ‌న్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌గా వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపించింది. త‌మ‌న్ అందించిన పాట‌ల‌కు భారీ క్రేజ్ ల‌భించింది. బంటుగా అల్లు అర్జున్ న‌ట‌న‌, క్లైమాక్స్‌లో సిత్త‌రాల సిర‌ప‌డు పాట‌తో త్ర‌విక్ర‌మ్ చేసిన ప్ర‌యోగం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుని సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిపింది, ఇందులో సుశాంత్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. బ‌న్నీకి, సుశాంత్‌కి మ‌ధ్య వ‌చ్చే ఓ స‌ర‌దా స‌న్నివేశాన్ని నిడివి ఎక్కువ కావ‌డంతో తీసేశార‌ట‌.

తాజాగా ఆ సీన్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ సీన్‌లో సుశాంత్ స్విమ్మింగ్ ఫూల్‌లో స్విమ్ చేస్తూ బ‌న్నీ ద‌గ్గ‌ర‌కి వ‌స్తాడు. అప్పుడు బ‌న్నీ స‌రదాగా షూట్ చేసిన వీడియోని సుశాంత్‌కి చూపిస్తాడు. అందులో సుశాంత్ అర్జున్‌రెడ్డి త‌ర‌హాలో బాటిల్ ఎత్తి దించ‌కుండా తాగుతుంటే `అర్జున్‌రెడ్డి` బ్యాగ్రౌండ్ స్కోర్ వినిపించ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ సీన్‌కి `అర్జున్‌రెడ్డి పార్ట్ 2` అని బ‌న్నీ పేరు పెట్ట‌డం, ఆ త‌రువాత సీన్‌లో సుశాంత్ లోక‌ల్ బ‌స్ వెన‌కాల ప‌రుగెత్తుతున్న సీన్‌లు న‌వ్వులు పూయిస్తున్నాయి.