ప‌బ్లిక్ గా రెచ్చిపోతున్నారుగా!


Malaika Arora kissed Arjun Kapoor pic goes viral
Malaika Arora kissed Arjun Kapoor pic goes viral

బాలీవుడ్ హాట్ జోడీగా మ‌లైకా అరోరా ఖాన్‌, అర్జున్ క‌పూర్ పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. హీరో స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్భాజ్‌ఖాన్‌తో విడిపోవ‌డానికి ముందు నుంచ మ‌లైకా అరోరా కుర్ర‌హీరో అర్జున్ క‌పూర్‌తో డేటింగ్ చేస్తూనే వుంది. నిత్యం ముంబై వీధుల్లో ఫొటో గ్రాఫ‌ర్ల‌కు జంట‌గా చిక్కుతూ వార్త‌ల్లో నిలిచారీజంట‌. తాజాగా అర్భాజ్‌ఖాన్, మ‌లైకాకు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్ర‌యించారు. వీరికి ముంబై కోర్టు 2017లో విడాకులు మంజూరు చేసింది.

అర్భాజ్‌ఖాన్‌తో డైవ‌ర్స్ తీసుకుని అత‌నితో త‌న వైవాహిక బంధాన్ని తెంచుకున్న మ‌లైకా అప్ప‌టి నుంచి అర్జున్‌క‌పూర్‌లో బ‌హిరంగంగా తిర‌గ‌డం మొద‌లుపెట్టింది. రెండేళ్లు కావ‌స్తున్నాడేటింగ్‌లోనే వున్న ఈ జంట బాంద్రా వీధుల్లో మీడియాకు, ప‌బ్లిక్‌కి క‌నువిందు చేస్తున్నారు. పెళ్లి విష‌యం వ‌చ్చేస‌రికి ఇప్పుడు పెళ్లేంట‌ని దాట‌వేస్తున్న ఈ జంట తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన ఓ ఫొటో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

ప్రియుడు అర్జున్ క‌పూర్‌ని మ‌లైకా అరోరా ముద్దాడుతున్న ఓ ఫొటో బాలీవుడ్‌లో వైర‌ల్ అవుతోంది. పెళ్లి అంటారు. కానీ పెళ్లి మాటెత్తితే దాట వేస్తుంటారు కానీ ముంబైతో పాటు హాలీడే వెకేష‌న్‌కి మాత్రం చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగేస్తున్నార‌ని, బాధ్య‌త‌గ‌ల కుటుంబాల‌కు చెందిన ఈ ఇద్ద‌రు ప‌బ్లిగ్గా రెచ్చిపోవ‌డం ఏమీ బాగాలేద‌ని బాలీవుడ్ స‌ర్కిల్స్‌లో అర్జున్‌క‌పూర్‌, మ‌లైకాల‌పై సైటైర్లు ప‌డుతున్నాయి. అర్జున్ క‌పూర్‌ని ముద్దాడుతున్న ఫొటోని మ‌లైకా ఇన్‌స్టాలో పోస్త చేయ‌డం ఆస‌క్తికరంగా మారింది. `స‌న్‌, స్టార్‌, లైట్ హ్యాపీనెస్ ..2020` అని మ‌లైకా ఈ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది.