మ‌తిపోగొడుతున్న మ‌లైకా లుక్స్‌!మ‌తిపోగొడుతున్న మ‌లైకా లుక్స్‌!
మ‌తిపోగొడుతున్న మ‌లైకా లుక్స్‌!

బాలీవుడ్ హాట్ ఐట‌మ్ బాంబ్ మ‌లైకా అరోరా నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్భాజ్‌ఖాన్ కి విడాకులిచ్చి సెప‌రేట్ అయిపోయిన మ‌లైకా ప్ర‌స్తుతం బోనీ క‌పూర్ త‌న‌యుడు అర్జున్ క‌పూర్ తో స‌హ‌జీవ‌నం చేస్తోంది. ఎక్క‌డికి వెళ్లినా ఈ జంట కెమెరా క‌ళ్ల‌కు చిక్కుతూనే వుంది. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన మ‌లైకా అరోరా సెల్ఫ్ ఐసోలేష‌న్ త‌రువాత మ‌ళ్లీ వ‌ర్కవుట్‌లు మొద‌లుపెట్టింది.

వ‌రుస ఫిట్‌నెస్ వీడియోల‌తో నెటిజ‌న్స్‌ని హీటెక్కించ‌డం అప్పుడే స్టార్ట్ చేసింది. నాలుగు ప‌దులు దాటి యాభైకి చేరువ‌వుతున్నా వ‌న్నె త‌ర‌గ‌ని అందాల‌తో కుర్ర‌భామ‌ల‌కు తాను ఎందులోనూ త‌క్కువ కాదంటూ ఛాలెంజ్ విసురుతోంది. క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న త‌రువాత స్పెష‌ల్ ఫొటో షూట్‌తో హ‌ల్‌చ‌ల్ చేసిన మ‌లైకా తాజాగా ముంబై వీధుల్లో ఆరెంజ్ క‌ల‌ర్ ట్రాక్ సూట్‌లో ముఖానికి బ్లాక్ మాస్క్ ధ‌రించి స్కిన్ టైట్ ఫిట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఫిట్ నెస్ కోసం జిమ్‌కి వెళ్ల‌డం కోసం బ‌య‌టికి వ‌చ్చిన మ‌లైకా కెమెరా కంటికి చిక్కింది. ఇంకే ముంది మ‌లైకా అందాల్ని క్లిక్ మ‌నిపించారు. మ‌లైకా టైట్‌ఫిట్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. వ‌య‌సు మీద‌ప‌డుతున్నా వ‌న్నెత‌ర‌గ‌ని అందాల‌తో మ‌లైకా హొయ‌లు పోతున్న తీరుకు నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు.