ఫొటోస్టోరీ: తెల్లగౌను వేసుకున్నపెద్ద పాప‌!


Malaika as glomorous diva in holographic gown
Malaika as glomorous diva in holographic gown

బాలీవుడ్ సెక్సీ లేడీ మ‌లైకా అరోరా ఏది చేసినా వింతే. న‌టుడు, నిర్మాత అర్భాజ్‌ఖాన్‌తో విడిపోయి కుర్ర హీరో అర్జున్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణంలో వుంది. గ‌త కొంత కాలంగా ప‌బ్లిగ్గా అర్జున్‌తో తిరిగేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఫ్యాష‌న్‌, ఫిట్ నెస్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాని మ‌లైకా త‌ర‌చూ డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ స్టైల్ డ్రెస్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తూ అటెన్ష‌న్ డ్రా చేస్తూ వుంటుంది. తాజాగా అలాంటి ప‌నే చేసింది.

సిల్వ‌ర్ క‌ల‌ర్ గౌనులో అందాలొలికిస్తూ ఫొటోల‌కి పోజులిచ్చింది. ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించిన హోలో గ్రాఫిక్ సిల్వ‌ర్ గౌన్‌లో మ‌లైకా కేక‌పుట్టించేస్తోంది. పాంట్ సూట్‌, హాట్ డ్రెస్‌…ఇలా ఏ ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు ఆ డ్రెస్‌ని ఫాలో అవుతూ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో క్రేజీ తార‌గా పేరు తెచ్చుకుంటున్న మ‌లైకా తాజా ఫొటో షూట్ సోష‌ల్ మీడియాలో ఆక‌ట్టుకుంటోంది.

మ‌లైక‌ని ఈ గౌన్‌లో చూసిన వాళ్లంతా తెల్ల గౌను వేసుకున్న పెద్ద పాపా అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. సిల్వ‌ర్ బెల్ట్‌, లైట్ మేక‌ప్‌, బ్లాక్ కోటెడ్ ఐబ్రోస్‌తో ప‌ర్‌ఫెక్ట్ దివ‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. 46 ఏళ్ల‌యినా ఇంకా వ‌న్నెత‌ర‌గని అంతంతో ఆక‌ట్టుకోవ‌డం మ‌లైకాకే చెల్లింద‌ని నెటిజ‌న్స్ షాక‌వుతున్నారు. మ‌ణిర‌త్నం `దిల్ సే` చిత్రంతో ఐట‌మ్ సాంగ్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన మ‌లైకా 2018 త‌రువాత మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. ఎన్నిఆఫ‌ర్లు ప‌ల‌క‌రించినా ముఖం చాటేస్తోంది.