ఇలా చేస్తే టైగ‌ర్‌ష్రాఫ్ ప‌రిస్థితేంటి?ఇలా చేస్తే టైగ‌ర్‌ష్రాఫ్ ప‌రిస్థితేంటి?
ఇలా చేస్తే టైగ‌ర్‌ష్రాఫ్ ప‌రిస్థితేంటి?

కాల్విన్ క్లెయిన్ లోదుస్తుల‌కు ప్ర‌చార క‌ర్త‌గా మారిన బాలీవుడ్ హాటీ దిషా ప‌టాని గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్‌లో వ‌రుస ఫొటోల‌తొ ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో సోస‌ల్ మీడియానే హీటెక్కించేస్తోంది. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో హీరో ఆదిత్యారాయ్ క‌పూర్ భుజాల‌పై కూర్చుని ముందుకు బెండై అత‌నితో దిషా ప‌టాని లిప్ లాక్ చేస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

ఆదిత్యారాయ్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `మ‌లంగ్‌`. అన్‌లీష్ ద మ్యాడ్‌నెస్ అని ట్యాగ్ లైన్‌. మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ల‌వ్ ఫిల్మ్స్, టి సిరీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో దిషా ప‌టాని హీరోయిన్‌గా న‌టిస్తోంది. దీనికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని శ‌నివారం రిలీజ్ చేశారు. అదే ఫొటోని హీరోయిన్ దిషా ప‌టాని సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో రిలీజ్ చేసింది. టూ వైల్డ్ సోల్స్‌.. వ‌న్ ల‌వ్‌..మ‌లంగ్‌. ట్రైల‌ర్ అవుట్ ఆన్ జ‌న‌వ‌రి 6` అని షేర్ చేసింది.

ఈ పిక్‌పై దిషా ఫ్యాన్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కొంత మందేమో ద్యావుడా! అని, మ‌రి కొంత మందేమో నాకు ఆ రోజు ఎగ్జామ్ వుంద‌ని, మ‌రి కొంత మంది సూప‌ర్బ్ కిస్ అని, కొంత మంది మాత్రం నిజంగా ఇలాంటి ముద్దు కావాలంటే అమ్మాయిలు ట్రై చేయండి అని కామెంట్‌లు పెడుతున్నారు. మ‌రి కొంత మంది మాత్రం ఇలా చేస్తే ఆమె ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ ప‌రిస్థితేంట‌ని సెటైర్లు వేస్తున్నారు.

Credit: Instagram