ఆ నలుగురు ఎవరు.? – “మలంగ్” ట్రైలర్Malang movie trailer
Malang movie trailer

రాజ్, కలియుగ్, ఆషికీ-2, ఎక్ విలన్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి హైలెవల్ ఎమోషనల్ లవ్ స్టోరీ లను డైరెక్ట్ చేసిన మోహిత్ సూరి తాజా సినిమా “మలంగ్”. తన గత సినిమాలో భాగంగా ఒక దాంట్లో హీరోను, మరొక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లను చంపేసిన దర్శకుడు ఇప్పుడు ఈ “మలంగ్” సినిమాలో  ఉన్న పాత్రలన్నిటి చేత హత్యలు చేయించడం చూపించాడు.

ప్రాణాలు తీయ్యడం అంటే, ఒకరికి పిచ్చి; ఒకరికి అవసరం,; ఒకరికి అలవాటు; హీరోయిన్ కి ఏమో మజా… ట్రైలర్ చూస్తే మనకు సినిమా అంతా ఒక ట్రాన్స్ లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా లో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూడా నటించాడు. ఇక ఇప్పటికే ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటాని కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా హిట్ అయ్యింది. ఇక కునాల్ ఖేము మరొక ప్రదానమిన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఒక్క రోజులోనే సుమారు 20 మిలియన్స్ వ్యూస్ దాటి రికార్డులు క్రియేట్ చేసింది.

రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.