మోహిత్ సూరి మార్క్ మ్యాజిక్ – “మలంగ్” రివ్యూ


మోహిత్ సూరి మార్క్ మ్యాజిక్ – “మలంగ్” రివ్యూ
మోహిత్ సూరి మార్క్ మ్యాజిక్ – “మలంగ్” రివ్యూ

ఒక సినిమాకు కావలసింది కేవలం కథ, బడ్జెట్, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ మాత్రమే కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది “ఎమోషన్.” చూసే ప్రేక్షకులకు కానీ, తీసే మేకర్స్ కానీ ఆ సబ్జెక్ట్ పట్ల మాటల్లో చెప్పలేని ఒక ఎమోషన్ ను ఫీల్ అయినప్పుడే సినిమా హిట్ అవుతుంది. అలాంటి ఒక కల్ట్ ఫీల్ ను తమ సినిమాల్లో డెలివర్ చేసే దర్శకులలో ఒకరు డైరెక్టర్ మోహిత్ సూరి. ఆయన తీసిన “మలంగ్” సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది.

కథ:
కథ విషయానికి వస్తే, జీవితాన్ని చాలా సరదాగా గడిపేసే ఇద్దరు వ్యక్తులు అద్వైత్ ఠాకూర్ (ఆదిత్య రాయ్ కపూర్), సారా (దిశా పటాని) గోవాలో కలుస్తారు. ఒకరినొకరు ఇష్టపడతారు. ప్రేమించుకుంటారు. అనుకోకుండా వాళ్ళ జీవితంలో జరిగిన ఒక సంఘటనతో 5 ఏళ్ళ తరువాత అద్వైత్ సీరియల్ కిల్లర్ గా మారి పోలీసులను చంపుతూ ఉంటాడు. అద్వైత్ ను అడ్డుకోడానికి, ఈ హత్యలు దర్యాప్తు చెయ్యడానికి ఆంజనేయ అఘసేసే (అనిల్ కపూర్), మైఖేల్ (కునాల్) రంగంలోకి దిగుతారు. అసలు అద్వైత్ ,సారా జీవితాల్లో ఏం జరిగింది.? అనేది మిగిలిన కథ.

నటీ నటులు & టెక్నికల్ అంశాలకు వస్తే :
ఒక జంట, ప్రేమలో ఉండటం, అనుకోకుండా వాళ్ళ జీవితాల్లో ఒక ట్విస్ట్, తరువాత హీరో రివెంజ్ తీర్చుకోవడం, క్లైమాక్స్ లో మళ్ళీ ట్విస్ట్ ఇలా చాలా సినిమాలు వచ్చాయి. రొమాంటిక్, క్రైమ్, థ్రిల్లర్ కథలను తనదైన స్క్రీన్ ప్లే తో నడిపించే మోహిత్ సూరి ఈసారి కూడా తన మార్క్ చూపించాడు. వికాస్ రామన్ సినిమాటోగ్రఫీ అయితే అద్భుతం అనే మాట చెప్పాలి. ఇక మోహిత్ సినిమాలకు రెగ్యులర్ గా మ్యూజిక్ చేసే మిథున్, అంకిత్ మరికొంతమంది కలిసి ఒక రకమైన వైబ్రేషన్ ఫీల్ తీసుకొచ్చారు.

ఫైనల్ గా రొమాంటిక్,క్రైమ్,థ్రిల్లర్, రివెంజ్ స్టోరీలు ఇష్టపడే వాళ్ళకు ఫుల్ మీల్స్. సాధారణ ప్రేక్షకులు ఒక్కసారి చూసి వావ్ అని అనుకోవచ్చు.

రేటింగ్: 2.75/5