`పెళ్లి సంద‌డి` సీక్వెల్‌లో రాజ్‌త‌రుణ్ హీరోయిన్‌!


`పెళ్లి సంద‌డి` సీక్వెల్‌లో రాజ్‌త‌రుణ్ హీరోయిన్‌!
`పెళ్లి సంద‌డి` సీక్వెల్‌లో రాజ్‌త‌రుణ్ హీరోయిన్‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌‌క‌త్వంలో  శ్రీ‌కాంత్ హీరోగా న‌టించిన చిత్రం `పెళ్లి సంద‌డి`. 196లో దాదాపు 25 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఈ చిత్రం హీరోగా శ్రీ‌కాంత్ కెరీర్‌నే మార్చింది. కీర‌వాణి మ్యూజిక‌ల్ హిట్‌గా మ‌లిచిన ఈ చిత్రానికి తాజాగా సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. `పెళ్లిసంద‌D` పేరుతో దీన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ న‌రేన‌న్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతోంది. బాహుబ‌లి నిర్మాత‌ల‌తో క‌లిసి రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు కె. కృష్ణ‌మోహ‌న్‌రావు నిర్మించ‌బోతున్నారు. దీనికి కూడా కీర‌వాణి స్వ‌రాలు అందించ‌బోతున్నారు. ఇందులో హీరోగా హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ న‌టించ‌బోతున్నాడు.

ఇటీవ‌లే మేక‌ర్స్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక త్వ‌ర‌లో సెట్స్ పైకి రానున్న ఈ మూవీలో రోష‌న్‌కు జోడీగా మాళ‌విక నాయ‌ర్ క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించ‌డానికి ఆమె ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే అధికార‌కంగా ఈ విష‌య‌న్ని మేక‌ర్స్ వెల్ల‌డించ‌నున్నార‌ట‌. మాళ‌విక నాయ‌ర్ ఇటీవ‌ల రాజ్ త‌రుణ్‌తో క‌లిసి `ఒరేయ్ బుజ్జిగా` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.