`నేల‌ టిక్కెట్‌` భామ సారీ హంగామా!


`నేల‌ టిక్కెట్‌` భామ సారీ హంగామా!
`నేల‌ టిక్కెట్‌` భామ సారీ హంగామా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ మూవీ `నేల టిక్కెట్టు`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మాళ‌వికా శ‌ర్మ‌. తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయినా సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ ఫొటోషూట్‌ల‌తో నెటిజ‌న్స్‌ని ఎట్రాక్ట్ చేస్తూ ఇన్ స్టాని హీటెక్కించేస్తోంది. రామ్ న‌టించిన `రెడ్` మూవీతో టాలీవుడ్‌లో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న మాళ‌వికా శ‌ర్మ ఇటీవ‌ల ఫిలాస‌ఫీతో క‌ట్టిప‌డేసింది.

కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోవాల్సిందే అంటూ నెటిజ‌న్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తాజాగా మ‌రో సారి త‌న‌దైన స్టైల్లో సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. కొత్త‌గా సారీలో హొయ‌లు పోతూ మావికా శ‌ర్మ షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బికినీ… సెక్సీ మోడ్ర‌న్ డ్రెస్సుల్లో సంద‌డి చేసిన మాళ‌వికాశ‌ర్మ తాజాగా అచ్చ‌తెలుగు అందం చీర‌క‌ట్టులో ద‌ర్శ‌న‌మిచ్చి సోష‌ల్ మీడియాని వేడెక్కిస్తోంది.

21 ఏళ్ల ఈ ముంబై చిన్న‌ది బ్లూ క‌ల‌ర్ బ్లౌజ్‌, మెరున్ క‌ల‌ర్ సారీ ధ‌రించి హొయ‌లు పోతూ క‌వ్విస్తోంది. స‌రికొత్త అందాల‌తో మేక‌ర్స్‌ని ఛాలెంజ్ చేస్తున్న ఈ వ‌య్యారి న‌డుమొంపుల‌కు ఫిదా కానీ వారుంటారా?
తెలుగులో వ‌రుస ఆఫ‌ర్లు ఇచ్చేయ‌రూ.. అంటున్నారు మాళ‌వికా శ‌ర్మ సారీ ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ . టాలీవుడ్ మేక‌ర్స్ కూడా ఇదే ఫీల్‌తో మాళ‌విక శ‌ర్మ‌కు వ‌రుస ఆఫ‌ర్లు ఇస్తారేమో చూడాలి.