కొన్ని కోల్పోతేనే కొన్ని ద‌క్కుతాయ‌ట‌!


కొన్ని కోల్పోతేనే కొన్ని ద‌క్కుతాయ‌ట‌!
కొన్ని కోల్పోతేనే కొన్ని ద‌క్కుతాయ‌ట‌!

`నేల టిక్కెట్టు` సుంద‌రి మాళ‌వికా శ‌ర్మ‌ ఫిలాస‌ఫీ చెబుతోంది. ఈస్ట్ ముంబైలోని అంథేరీలో పుట్టిన ప్ర‌స్తుతం లా పూర్తి చేసే ప‌నిలో వుంది. కాలేజ్ డేస్ నుండి మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించిన మాళ‌విక తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె న‌టించిన తొలి చిత్రం `నేల‌టిక్కెట్టు`. భారీ అంచ‌నాలు పెట్ఉకుని అందాల విందు చేసినా ఈ మూవీ మాళ‌విక‌కు ఎలాంటి ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది.

ఆ క్ష‌ణం నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్‌ల‌ని త‌న దైన గ్లామ‌ర్ స్టిల్స్‌తో ఆక‌ట్టుకోవ‌డం మొద‌లుపెట్టింది. 21 ఏళ్ల ఈ ముంబై చిన్న‌ది చిట్టి పోట్టి డ్రెస్సుల్లో అందాల విందు చేస్తూ నెటిజ‌న్స్‌తో పాటు తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో అటెన్ష‌న్ క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `రెడ్‌`లో న‌టిస్తోంది.

కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. గ‌త కొన్ని నెల‌లగా హాట్ ఫొటోల‌తో నెటిజ‌న్స్‌ని ఎట్రాక్ట్ చేసిన మాళ‌విక శ‌ర్మ తాజాగా ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చింది. దీనికి ఆస‌క్తిక‌ర‌మైన కాప్ష‌న్‌ని జ‌త‌చేసి ఆక‌ట్టుకుంటోంది. కొన్నింటిని కోల్పోతోనే కొన్ని ద‌క్కుతాయ‌ని ఫిలాస‌ఫీ చెబుతోంది.