మ‌హేష్ కోసం `అల వైకుంఠ‌పుర‌ములో` స్టార్‌!

మ‌హేష్ కోసం `అల వైకుంఠ‌పుర‌ములో` స్టార్‌!
మ‌హేష్ కోసం `అల వైకుంఠ‌పుర‌ములో` స్టార్‌!

టాలీవుడ్‌లో మ‌ల‌యాళ రీమేక్‌ల జోరే కాదు మ‌ల‌యాళ న‌టులంటే కూడా క్రేజ్ పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు మ‌ల‌యాళ చిత్రాలు తెలుగులో స్టార్ హీరోల‌తో రీమేక్ అవుతున్నాయి. అంతే కాకుండా మ‌ల‌యాళ స్టార్స్ కూడా తెలుగులో భారీ చిత్రాల్లోని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో ` చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్ న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. అలాగే `పుష్ప‌` చిత్రంలోనూ మ‌రో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే `అల వైకుంఠ‌ప‌పుర‌ములో` చిత్రంలో బ‌న్నీకి ఫాద‌ర్‌గా న‌టించిన జ‌య‌రామ్ తాజాగా మ‌రో స్టార్ హీరోకి ఫాద‌ర్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని తెలిసింది. వివ‌రాల్లోకి వెళితే.. `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని మైత్రీతో క‌లిసి 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి.

బ్యాకింగ్ రంగంలో జ‌రిగే వైట్ కాల‌ర్ నేరాల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క షెడ్యూల్‌ని దుబాయ్‌లో పూర్తి చేశారు. మ‌రోసారి ఈ చిత్ర బృందం దుబాయ్‌కి వెళ్ల‌బోతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రంలో మ‌హేష్‌కి ఫాద‌ర్‌గా కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్ న‌టించే అవకాశం వుంద‌ని తెలుస్తోంది. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.