మలయాళ సినిమాలపైన ప్రేమ కురిపిస్తున్న టాలీవుడ్


మలయాళ సినిమాలపైన ప్రేమ కురిపిస్తున్న టాలీవుడ్
మలయాళ సినిమాలపైన ప్రేమ కురిపిస్తున్న టాలీవుడ్

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా మలయాళ సినిమాల హంగామా కనిపిస్తోంది. దాదాపుగా అరడజనుకు పైగా మలయాళ సినిమాలు తెలుగులో తెరకెక్కడానికి సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ సినిమా లూసిఫెర్ ను రీమేక్ చేయనున్న విషయాన్నీ అధికారికంగా వెల్లడించిన సంగతి తెల్సిందే. సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యాడు కూడా. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

ఇక సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం కూడా మలయాళ రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా జులై 15న నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధమైంది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రెండు మలయాళ సినిమాల హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్స్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్, కప్పెల చిత్ర రీమేక్ హక్కులను ఈ సంస్థ దక్కించుకుంది.

అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటించడానికి రవితేజ, రానా హీరోలుగా నటించనున్నారు. పివిపి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ హెలెన్ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళ సినిమా కూడా టాలీవుడ్ లోకి రీమేక్ అవుతోంది. ఇలా వరస మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్స్ అవుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.