విడాకుల గురించి నోరు విప్పిన మలైకా


Malika Arora revealed her divorce

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు హాట్ భామ మలైకా అరోరా విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే అర్భాజ్ ఖాన్ కు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో తాజాగా ఓ షోలో పాల్గొన్న మలైకా వివరించింది . మేమిద్దరం విడాకులు తీసుకోకుండా కలిసి ఉండాలని రెండు కుటుంబాల వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసారని కానీ అర్భాజ్ తో ఉంటే నేను  సంతోషంగా ఉండలేను అనే నిజం నాకు తెలుసు కాబట్టి విడిపోవాల్సి వచ్చిందని అసలు విషయాన్నీ చెప్పేసింది .

 

అంటే ఈ భామ చెప్పే విషయం ఏంటంటే భార్యాభర్తలుగా కాపురం చేయాల్సి ఉంటుంది కానీ ఆ సుఖంలో ఎక్కడా సంతోషం లేదని అందుకే విడిపోయానని , ప్రస్తుతం  చాలా  సంతోషంగా ఉన్నానని అంటోంది . అవును మరి కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది కదా ! ఎందుకు సంతోషంగా ఉండదు . త్వరలోనే మలైకా అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకోనుందని తెలుస్తోంది . అన్నట్లు అర్జున్ కపూర్ కంటే 12 ఏళ్ళు పెద్దది మలైకా అరోరా .

English Title: Malika Arora revealed her divorce