మల్లేశం రివ్యూ


Mallesham Movie Review in Telugu
Mallesham Movie Review in Telugu

మల్లేశం రివ్యూ:

నటీనటులు : ప్రియదర్శి , అనన్య , ఝాన్సీ
సంగీతం : మార్క్ కే రాబిన్
నిర్మాతలు : రాజ్ , శ్రీ అధికారి
దర్శకత్వం : రాజ్ ఆర్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 21 జూన్ 2019

టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది , ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్ లు రాగా తాజాగా చింతకింది మల్లేశం జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ” మల్లేశం ”. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది చూద్దామా !

కథ :
నల్గొండ జిల్లా లోని ఓ కుగ్రామంలో పద్మశాలి కులాన్ని చెందిన వ్యక్తి చింతకింది మల్లేశం (ప్రియదర్శి ) . నేతపని చేసే మల్లేశం తల్లి లక్ష్మి (ఝాన్సీ )ఆసు పని చేస్తూ ఇబ్బంది పడుతుంటుంది . భుజం నొప్పి పెట్టినప్పటికీ ఓపిక చేసుకొని పని చేస్తూనే ఉంటుంది . దాంతో తల్లి కష్టాన్ని కళ్లారా చూసిన మల్లేశం ఆసు యంత్రం కనిపెట్టాలని భావిస్తాడు . అయితే ఆ ఆసు యంత్రం తయారు చేసే నెపంతో అప్పులు చేస్తాడు .

మల్లేశం చేసే పనికి ఊళ్ళో వాళ్ళు పిచ్చోడిలా చూస్తుంటారు . మల్లేశం ని ఇలాగె వదిలేస్తే ప్రమాదమని భావించి పెళ్లి చేస్తారు . ఆసు యంత్రం కోసం భార్య నగలు అడుగుతాడు దాంతో భార్య ఎదురుతిరగడంతో గొడవపడతాడు మల్లేశం . చివరకు మల్లేశం ఆసు యంత్రం ఎలా కనిపెట్టాడు , విజయాలు ఎలా దక్కించుకున్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
ప్రియదర్శి
ఝాన్సీ
అనన్య
కథ
దర్శకత్వం

డ్రా బ్యాక్స్ :
స్లో నెరేషన్

నటీనటుల ప్రతిభ :
ఈ చిత్రానికి ప్రియదర్శి నటన అలాగే అనన్య నటన హైలెట్ గా నిలిచింది . అంతేకాదు ఝాన్సీ కూడా తన పాత్రకు జీవం పోసింది . ముఖ్యంగా చెప్పాలంటే ప్రియదర్శి మల్లేశం పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడంటే అతిశయోక్తి కాదు సుమా ! ఎందుకంటే ప్రియదర్శి అంటే కేవలం హాస్య నటుడు అన్న ముద్ర చెరిపేస్తుంది . అంతేగాదు పరిపూర్ణ నటుడిగా తీర్చిదిద్దడం ఖాయం అంతగా మెప్పించాడు . ఇక అనన్య గురించి చెప్పాల్సి వస్తే కొన్ని సన్నివేశాల్లో ప్రియదర్శి ని డామినేట్ చేసిందని చెప్పక తప్పదు . ఈ ముగ్గురు కూడా మల్లేశం చిత్రానికి ఆయువు పట్టుగా మారారు .

సాంకేతిక వర్గం :
ముందుగా ఈ కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడ్ని తప్పకుండా అభినందించాలి . తన మొదటి ప్రయత్నం లోనే మల్లేశం బయోపిక్ ని ఎంచుకొని దాన్ని సరైన దిశలో నడిపించి మంచి మార్కులు కొట్టేసాడు రాజ్ ఆర్ . నటీనటులను ఎంచుకోవడమే కాకుండా వాళ్ళ నుండి తనకు రావాల్సిన నటనని రాబట్టుకున్నాడు . నటీనటుల నుండి మాత్రమే కాకుండా సాంకేతిక నిపుణుల నుండి కూడా తగిన సహకారం అందుకున్నాడు . విజువల్స్ బాగున్నాయి , గ్రామీణ వాతావరణాన్ని , అక్కడి పరిస్థితులను చక్కగా ప్రతిబింభించేలా తన కెమెరా పనితనాన్ని చూపించారు . ఇక సంగీతం కూడా ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది . నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఓవరాల్ గా :
మనసుకి హత్తుకునే మల్లేశం