డైరక్టర్ వి .వి వినాయక్ చేతుల మీదుగా మళ్లీ మళ్లీ చూసా


Malli Malli Chusa movie Song Released

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మళ్లీ మళ్లీ చూశా“. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు.శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం లొని “చినుకే నాకె చూపె” అనే పాట ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా సెన్సేషనల్ డైరక్టర్ వినాయక్ విడుదల చేశారు.

 

 

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. “మళ్లీ మళ్లీ చూశా” పాట వినసొంపుగా ఉంది. ట్రైలర్ సైతం అందంగా అందరికీ చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

 

 

దర్శకుడు సాయిదేవ రామన్ .. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుందన్న కాన్సెప్ట్ తొ తీసిన సినిమా “మళ్ళీ మళ్ళీ చూశా” . శ్రవణ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఎసెట్స్ గా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

 

నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. మా చిత్రం లోని మొదటి పాటను వినాయక్ గారు విడుదల చేసినందుకు ధన్యవాదాలు. మనస్సుకు హత్తుకునే అహ్లాదకరమైన చిత్రం మా “మళ్లీ మళ్లీ చూశా” అన్నారు.

 

హీరొ అనురాగ్ మాట్లాడుతూ.. ‌వి .వి వినాయక్ గారు మొదటి పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది . తెలుగులో చాలా రోజుల తర్వాత వస్తోన్న ఆహ్లాదకరమైన ప్రేమ కధా చిత్రం. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. మళ్లీ మళ్లీ చూడాలనిపించె ప్రేమకథ ఇదన్నారు.

 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి సతీష్ పాలకుర్తి మాట్లాడుతూ ” బిజీ గా ఉన్నప్పటికీ అడగ్గానే మా సాంగ్ ను లాంచ్ చేసిన వినాయక్ గారికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ చూసేలా సినిమా ఉంటుందని” అన్నారు

ఈటివి ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని,ప్రభావతి, జయలక్ష్మి, రీతూ చౌదరి తదితరులు నటించిన

ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,ఛాయాగ్రాహకుడు : సతీష్ ముత్యాల,
మాటలు : హేమంత్ కార్తీక్,
ఎడిటర్ : సత్య గిడుతూరి,
పాటలు : తిరుపతి జావాన,
కళా దర్శకుడు : సుమిత్ పటేల్ బి.ఫ్.ఏ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి, నిర్మాత : కోటేశ్వరరావు కొణిదెన
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సాయిదేవ రామన్.
English Title: Malli Malli Chusa movie Song Released

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil's Mr Majnu full movie leaked onlineHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaBollywood hero rajkumar rao crush on Aishwarya rai