బెడ్ రూం లోకి రాలేదని ఛాన్స్ లు ఇవ్వలేదట


mallika sherawat sensational comments on casting couch

శృంగార సన్నివేశాల్లో ఎలాగూ రెచ్చిపోయి నటిస్తున్నావు కదా , ఆన్ స్క్రీన్ రొమాన్స్ మాత్రమేనా ? ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కి ఛాన్స్ ఇవ్వవా ? బెడ్ రూం లో స్వర్గం అందించమని కోరారట చాలామంది సినిమా వాళ్ళు దాంతో నేను నటించడానికి వచ్చాను కానీ మీ పక్కలో పడుకోవడానికి కాదురా ! అంటూ అందరినీ తిరస్కరించిందట హాట్ భామ మల్లికా శెరావత్ అందుకే సినిమా రంగంలోకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ తక్కువ చిత్రాల్లోనే నటించింది మల్లికా శెరావత్ .

దర్శకులు , నిర్మాతలు , హీరోలు ఇలా చాలామంది మల్లికా శెరావత్ ని స్వర్గం అందించమని ఓపెన్ గా అడిగారట . ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో ఇరగదీస్తున్నావ్ కదా ! ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ ఇరదీద్దాం అని చాలామంది అడిగారట అయితే నేను ఒప్పుకోలేదని దాంతో నన్ను వాళ్ళ సినిమాల్లోంచి తీసేశారని లేదంటే ఎక్కువ సినిమాల్లో నటించేదాన్ని అని అంటోంది మల్లికా శెరావత్ .

కాస్టింగ్ కౌచ్ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది , ఇక బాలీవుడ్ లో అయితే దానికి లెక్కేలేదు . ఇప్పటికే పలువురు హీరోయిన్ లు కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేయగా తాజాగా ఆ లిస్ట్ లోకి మల్లికా శెరావత్ కూడా చేరింది .