బిల్‌గేట్స్‌తో క‌లిసి మ‌ల్లికా షెరావ‌త్ ఏం చేస్తోంది?బిల్‌గేట్స్‌తో క‌లిసి మ‌ల్లికా షెరావ‌త్ ఏం చేస్తోంది?
బిల్‌గేట్స్‌తో క‌లిసి మ‌ల్లికా షెరావ‌త్ ఏం చేస్తోంది?

మ‌ల్లికా షెరావ‌త్‌.. బాలీవుడ్ తెర‌పై హాట్ చిత్రాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన తార‌. ఖ్వాహిష్‌, మ‌ర్డ‌ర్‌, బ‌చ్ కె రెహ‌నారే బాబా, హిస్‌, ద మిత్ వంటి చిత్రాల‌తో యువ‌త‌ని ఎర్రూత‌లూగించింది. 2017 వ‌ర‌కు సినిమాల్లో మెరిసిన ఈ హాటీ లేడీ ప్ర‌స్తుతం అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో వెబ్ సిరీస్‌ల బాట ప‌ట్టింది. మ‌ల్లికా షెరావ‌త్ న‌టించిన తాజా వెబ్ సిరీస్ `బూ ప‌బ్‌కీ ఫ‌టేగీ`. న‌డిచే దెయ్యం పాత్ర‌లో న‌టించిన మ‌ల్లిక‌కు ప్ర‌స్తుతం ఆ వెబ్ సిరీస్‌లు కూడా లేవు.

సినిమాల్లో వెన‌క‌బ‌డిపోయిన ఈ హాటీ లేడీకి వెబ్ సిరీస్ అవ‌కాశాలు కూడా ద‌క్క‌కుండా దోబూచులాడుతున్నాయి. దీంతో లండ‌న్‌కు మ‌కాం మార్చిన మ‌ల్లిక నిత్యం ఏదో ఒక వంక‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. ఇందుకు సోష‌ల్ మీడియాని బాగా వాడేస్తోంది. సినిమాలు లేక‌పోయినా చాలా మంది సెల‌బ్ర‌టీల‌కు సోష‌ల్ మీడియా మంయి ప్లాట్ ఫామ్‌గా మారిన విష‌యం తెలిసిందే.

మ‌ల్లిక కూడా సోష‌ల్ మీడియానే న‌మ్ముకుని నిత్యం లైమ్ లైట్‌లో వుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా మ‌ల్లిక పెట్టిన ఓ పోస్ట్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కంప్యూట‌ర్‌ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన బిల్‌గేట్స్తో దిగిన ఫొటోని మ‌ల్లిక తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. మ‌హిళా సాధికార‌త‌పై బిల్‌గేట్స్‌తో చ‌ర్చించాన‌ని, ఆయ‌న‌తో జ‌రిపిన సంభాష‌ణ‌ని త‌ను చాలా ఎంజాయ్ చేశాన‌ని పోర్కొంటూ ఓ ఫొటోని షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.