మమ్ముట్టి కెరియర్ లో No 1 సినిమా “మామంగం”


Mamangam Movie is prestigious in Mammootty career
Mamangam Movie is prestigious in Mammootty career

కేరళ రాష్ట్రానికి “గాడ్స్ ఓన్ కంట్రీ” అనే ఒక గొప్ప పేరు ఉంది. అంటే స్వయంగా భగవంతుడే ఇక్కడ నివసించే వాడు అని అర్థం. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు తో పాటు సాంస్కృతికంగా నాగరికంగా ఎంతో అద్భుతమైన కల్చర్ ఇక్కడ ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన ప్రకారం తమిళము, కన్నడము, మళయాళము మరియు తెలుగు మాట్లాడే ప్రజల ప్రాతిపదికన నాలుగు రాష్ట్రాలుగా విభజించబడ్డాయి. కానీ అంతకు ముందు దాదాపు అన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్లు 4 రాష్ట్రాలలో కలిసిమెలిసి ఉండే వాళ్ళు. మన తెలుగు ప్రజలకు పుష్కరాలు మరియు తమిళనాడు ప్రజలకు కుంభకోణం జాతర లాగా మలయాళం ప్రజలకు అనగా కేరళలో “మామంగం” అని ఒక కల్చర్ వుండేది. అందులో పలు తెగలకు చెందినటువంటి ప్రజలు కలిసి పాల్గొనేవారు. భారతదేశంలో అడుగుపెట్టాలని విదేశీయులు లో మొట్టమొదట పోర్చుగీసువారు అడుగు పెట్టింది కూడా కేరళలోనే.

ఆ తర్వాత సనాతన భారతీయ సంస్కృతిలో పై కుట్ర చేసే భాగంగా అనేక దుష్టశక్తులు తమ యొక్క కార్యాచరణ ప్రారంభించింది కూడా కేరళ నుండే. ఇది వరకు మనం చెప్పుకున్నట్లు “గాడ్స్ ఓన్ కంట్రీ” అని పిలవబడే కేరళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అది తెలుసుకోవాలంటే ఈ మధ్య డైరెక్టర్ తీసిన లీజో జార్జ్ తీసిన జల్లికట్టు అనే సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఒకప్పుడు పరాయి దేశాల వాళ్లు వచ్చి అడుక్కుంటే, బస్తాలతో మిరియాలు వాళ్ళ మొహాన కొట్టిన కేరళ ప్రజలు ఇప్పుడు మాంసాహారం కోసం వాళ్ళలో వాళ్ళు ఎలా గొడవపడుతున్నారో ఆ సినిమాలో చూపించారు.

మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముట్టి ఇప్పుడు తాన “మామంగం” 12వ శతాబ్దపు కేరళ యొక్క గొప్పతనాన్ని మరియు అప్పటి అద్భుతమైన కేరళ నాగరిక పరిస్థితులను మరియు ప్రజల మధ్య చిచ్చు పెట్టిన దురాచారాలను

మూఢనమ్మకాలను, ఆధిపత్యం కోసం పలు తెగల మధ్య జరిగిన వర్గ పోరును ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో చూపించారు.

ఈ సినిమాలో ఒక్క మమ్ముట్టి తప్ప మిగతా నటీనటులు టెక్నీషియన్లు అందరూ ఇంచుమించు కొత్త వారే కావడం గమనార్హం. దాదాపు అనేక సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే మమ్ముట్టి తెలుగులో నేరుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అయిన “యాత్ర” సినిమా లో కనిపించారు. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎప్పటిలాగే మెప్పించారు. గతంలో కూడా మమ్ముట్టి “సామ్రాజ్యం”, “కంకణం” అనే సినిమాలతో పాటు కళాతపస్వి కె.విశ్వనాథ్ డైరెక్షన్ చేసిన స్వాతికిరణం అనే సినిమాలో అద్భుతంగా నటించారు.

తెలుగు ప్రేక్షకులు మమ్ముట్టి ని ఎప్పుడు దూరం చేసుకోలేదు. తెలుగు చిత్రసీమలో మమ్ముట్టి కి ఉండే క్రేజ్ మరియు మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని గీత ఆర్ట్స్ అల్లుఅరవింద్ దగ్గరుండి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పద్మ కుమార్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచి పాటలు అద్భుతమైన లొకేషన్లలో పాటు కేరళ ప్రాచీన యుద్ద కళ కలరియ పట్టు గురించి కూడా ప్రస్తావన ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మలయాళ సినిమా రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. గతంలో కూడా ఒక అద్భుతమైన సినిమా అయిన “ఉరుమి” మలయాళ సినిమా స్టామినాను దేశవ్యాప్తంగా తెలియచెప్పింది. ఆ సినిమాకు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వం వహించారు. కాకపోతే ఆ సినిమాలో పృథ్వీరాజ్ ప్రభుదేవా నిత్యామీనన్,టబు,జెనీలియా. వంటి స్టార్లు నటించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ పెద్ద హిట్ గా నిలిచి మమ్ముట్టి ఇకపై వరుసగా తెలుగు సినిమాలు చేయాలని కోరుకుందాం.