షూటింగ్ లో సూపర్ స్టార్ కు గాయాలు


mammootty injured in shooting

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కి షూటింగ్ లో గాయాలయ్యాయి దాంతో షూటింగ్ ని అర్దాంతరంగా ముగించారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఇటీవల జరిగింది . మమ్ముట్టి తాజాగా ” మామంగమ్ ” చిత్రంలో నటిస్తున్నాడు . సజీవ్ పిళ్ళై దర్శకత్వంలో 50 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది కాగా ఈ చిత్రంలో మమ్ముట్టి నాలుగు పాత్రల్లో నటిస్తున్నాడు . అయితే యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో మమ్ముట్టి కి గాయాలైనట్లు ఆ చిత్ర బృందం ప్రకటించింది .

అయితే మమ్ముట్టి కి పెద్దగా గాయాలు కాలేదని , ప్రస్తుతం కోలుకుంటున్నారని విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు చిత్ర బృందం . మలయాళ భాషలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో ,హిందీలో , ఇంగ్లిష్ లలో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . 66 ఏళ్ల వయసులో కూడా యుద్ధ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించడం వల్ల మమ్ముట్టి కి ఈ ఇబ్బందులు వచ్చాయి .