“మన నది – మన నుడి” పాట విడుదల


Mana Nudi Mana Nadi song released
Mana Nudi Mana Nadi song released

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదలైన “మన నది – మన నుడి” కార్యక్రమంలో భాగంగా ఒక పాటను జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు మరింత సాంకేతిక మెరుగులు దిద్ది, సంగీతపరంగా ఇంకాఉన్నతగా తీర్చిదిద్ది, జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున రాజమహేంద్రవరంలో గోదావరి హారతి కార్యక్రమం తాలుకూ విజువల్స్ జోడించి మళ్ళీ సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. ఇక ఈ పాటకు సాహిత్యం రామ జోగయ్య శాస్త్రి గారు; సంగీతం ఎస్.ఎస్.తమన్ అందించిన సంగతి తెలిసిందే.

జనసేన పార్టీ 7 సిద్దాంతాలలో మరియు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా కూడా ఒక జనసమూహానికి సంబంధించిన యాస మరియు పర్యావరణ పరిరక్షణకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఇక అనేక రకాల జానపదాలు ఆయన సినిమాలలో ఆయా ప్రాంతీయ కళలకు గౌరవంగా ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. ఇక పర్యావరణం, ప్రకృతి స్వయంగా వ్యవసాయం చెయ్యడం ఆయన ప్రవృత్తి. ఇప్పటికీ తన తోటలో స్వయంగా పండించిన మామిడి పండ్లను తన స్నేహితులకు పంపిస్తారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా గత 50 ఏళ్ళుగా యువతలో పవన్ కళ్యాణ్ కలిగించినంతగా రాజకీయ చైతన్యం ఎవరూ కల్పించలేదన్నది వాస్తవం.