రానాని తొంద‌ర‌పెట్టేస్తున్న మంచు ల‌క్ష్మి!


రానాని తొంద‌ర‌పెట్టేస్తున్న మంచు ల‌క్ష్మి!
రానాని తొంద‌ర‌పెట్టేస్తున్న మంచు ల‌క్ష్మి!

టాలీవుడ్ హంక్ ద‌గ్గుబాటి రానా త్వ‌ర‌లో మిహీకా బ‌జాజ్‌ని వివాహం చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే త‌న ప్రేమ విష‌యాన్ని వెల్ల‌డించి షాకిచ్చిన రానా, మిహీకా తో క‌లిసి ఇరు కుటుంబాల స‌భ్యులు పాల్గొన‌గా రోకా ఫంక్ష‌న్‌ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రానాతో మంచు ల‌క్ష్మి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పెష‌ల్ లైవ్ షోని నిరంహించింది.

రానా పెళ్లి వార్త వెల్ల‌డించిన త‌రువాత తొలిసారి ఇన్ స్టా లైవ్‌లోకి రావ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి మొద‌లైంది. ఇందుకు త‌గ్గ‌ట్టే మంచు ల‌క్ష్మీ రానాని త‌న ప్ర‌శ్న‌ల‌తో ప్రేమ వ్య‌వ‌హారాన్ని, పెళ్లి త‌రువాత చేయాల్సిన విష‌యాల్ని ట‌క ట‌కా రాబ‌ట్టేసింది. ద‌క్షిణాది భామ‌లంతా రానాని వివాహం చేసుకోవాల‌ని చూస్తుంటే ఎందుకు ఉత్త‌రాది అమ్మాయిని ఎంచుకున్నావ‌ని అడిగింది మంచు ల‌క్ష్మి, దీనికి రానా అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చాడు.. మ‌హీకా నివ‌సించేది ఉత్త‌రాదిలో కాద‌ని, జూబ్లీ హిల్స్‌లోనే అని చెప్పేశాడు. మిహీకా ప‌క్కా హైద‌రాబాదీ అమ్మాయి అని, అయితే త‌న‌లా తెలుగు మాట్లాడ‌లేద‌ని, స్ప‌ష్టం చేశాడు.

ఇదిలా వుంటే రానాకి మంచు ల‌క్ష్మి ఇచ్చిన స‌ల‌హా ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. అదేంటంటే వెంట‌నే పిల్ల‌ల్ని క‌నేయ్ అని, బుల్లిరానా, బుల్లి రాణీలు మీ చుట్టూ అల్ల‌రి చేస్తూ తిరుగుతుంటే చూడాలని వుంద‌ని, అందుకు ఎక్కువ స‌మ‌యం తీసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డం వైర‌ల్‌గా మారింది.

 

View this post on Instagram

 

Rana’s first interview after she said yes.. ♥️♥️♥️♥️♥️

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

Credit: Instagram