అసభ్య పదజాలంపై స్పందించిన మంచు లక్ష్మి


manchu laxmi fire on tv5 editorటివి 5 చర్చలో భాగంగా సినిమా రంగంలో ఉన్న మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన ఎడిటర్ పై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది , అయితే కేవలం ఫిర్యాదు చేసి మాత్రమే ఊరుకోమని ఆ జర్నలిస్ట్ ని క్షమించేది లేదని ….. అతడ్ని అంత ఈజీగా వదలమని అతడిపై తగిన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని అంటోంది మంచు లక్ష్మి .

అంతేకాదు అతడి వ్యాఖ్యలు సభ్య సమాజం క్షమించేలా లేవని , ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సినిమారంగంలోని మహిళలను అసభ్య పదజాలం తో దూషించడం దారుణమని అంటోంది మంచు లక్ష్మి . మొత్తానికి ఆ ఎడిటర్ కు కొత్త చిక్కులే వచ్చి పడ్డాయి .