విడాకులు ప్రకటించిన మంచు మనోజ్


విడాకులు ప్రకటించిన మంచు మనోజ్
విడాకులు ప్రకటించిన మంచు మనోజ్

మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం ఒక షాకింగ్ పోస్ట్ పెట్టాడు. తనకు విడాకులు మంజూరైనట్లు, ఇక భార్య ప్రణతి రెడ్డితో తన బంధం ముగిసినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే విడాకులు తర్వాత కూడా ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంటుందని మంచు మనోజ్ అన్నాడు.

ఈ కష్ట సమయంలో తనకు తోడుగా నిలిచిన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు మంచు మనోజ్ కృతఙ్ఞతలు చెప్పాడు. ఈ బంధం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని, మనసు బాగాలేకపోవడం వల్ల పని మీద ధ్యాస పెట్టలేకపోయానని మంచు మనోజ్ చెప్పాడు. త్వరలోనే తనకిష్టమైన సినిమాలను తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించాడు.

2015 మేలో మంచు మనోజ్, ప్రణతి రెడ్డిలు ఒక్కటవ్వగా, నాలుగేళ్ళు కూడా పూర్తవ్వకుండానే వీరి బంధం ముగియడం నిజంగా బాధాకరం. ఏదేమైనా ఈ నిర్ణయం ఇద్దరికీ మంచే చేస్తుందని ఆశిద్దాం. ఇన్నాళ్లూ నటనకు దూరంగా ఉన్న మంచు మనోజ్ త్వరగా తిరిగి సినిమాలు మొదలుపెట్టాలని అభిమానులు కోరుతున్నారు.