మంచు మనోజ్ విడాకులు తీసుకోవడం లేదట


manchu manoj reacts on divorceమంచు మనోజ్ విడాకులు తీసుకుంటున్నాడని పుకార్లు షికారు చేయడంతో ఆ వార్తలు మంచు మనోజ్ చెవిన కూడా పడ్డాయి దాంతో తన భార్య ప్రణతి తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు అయినప్పటికీ ఆ వార్తలకు బ్రేక్ పడకపోవడంతో ఎట్టకేలకు స్పందించాడు మంచు మనోజ్ . నేను – ప్రణతి హాయిగా ఉన్నాం , మా మధ్య ఎటువంటి గొడవలు లేవు …… మేము విడిపోవడం లేదు అంతేకాదు నా తదుపరి చిత్రం ప్రేమకథా చిత్రమని తెలిపాడు కూడా .

2015 లో ప్రణతి రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్ . ప్రణతి రెడ్డి తన వదినకు బంధువు దాంతో ప్రణతి – మంచు మనోజ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక , సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నాడు ఈ హీరో దాంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని విడాకులు తీసుకుంటున్నారని వార్తలు గుప్పుమనడంతో మంచు మనోజ్ ఆ వార్తలను ఖండించాడు .